ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌కు చెందిన శివ మానిక్పురి అనే రంగోలీ కళాకారుడు అరుదైన ఘనత సాధించాడు. మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని గీసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. బుధవారం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు శివకు ధ్రువపత్రాన్ని అందజేశారు.
3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్ - ప్రధాని మోదీ రంగోలీ చిత్రం
ఓ రంగోలి కళాకారుడు 3000 అడుగుల ప్రధాని మోదీ చిత్రాన్ని గీసి రికార్డు నెలకొల్పాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.
3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్
3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్
మొత్తం 700 కేజీలకుపైగా ముగ్గు ఉపయోగించి, ఏడు రోజులు శ్రమించి ఈ కళాఖండాన్ని సృష్టించానని చెప్పాడు శివ. 60 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు ఉన్న ఈ రంగోలీ చూపరులను ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి :పొడవైన రంగోలీ.. పోలింగ్‌కు చూపించే దారి
Last Updated : Mar 25, 2021, 6:31 PM IST