తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హనుమాన్ చాలీసా సవాల్​.. ఎంపీ నవనీత్ కౌర్​ దంపతుల అరెస్ట్​ - maharashtra Hanuman Chalisa controversy

Navneet Rana News: మహారాష్ట్ర సీఎం ఇంటి వద్ద తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతాని ఎంపీ నవనీత్​ రాణా సవాల్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆమె ఇంటి వద్దకు శివసేన కార్యకర్తలు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. నవనీత్ ఇంటిపై రాళ్లు రువ్వారు. ప్రధాని ముంబయి పర్యటనను దృష్టిలో ఉంచుకొని తన ఆందోళనను విరమిస్తున్నట్లు నవనీత్ కౌర్ ప్రకటించారు. అయితే, ఆందోళనలు తగ్గుముఖం పట్టకపోవడం వల్ల.. నవనీత్​ కౌర్​ను ఆమె భర్త రవి రాణాను పోలీసులు అరెస్టు చేశారు.

Navneet Rana
నవనీత్​ రానా

By

Published : Apr 23, 2022, 10:59 AM IST

Updated : Apr 23, 2022, 10:34 PM IST

Navneet Rana News: మహారాష్ట్ర అమరావతి ఎంపీ, టాలీవుడ్ మాజీ నటి నవనీత్ కౌర్​ రాణా ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి ముంబయిలోని ఆమె నివాసం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటారు. కొందరు కార్యకర్తలు నవనీత్ ఇంటిపై రాళ్లు రువ్వారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు ఆయన ఇంటిముందు తన భర్త, ఎమ్మెల్యే రవి రాణాతో కలిసి శనివారం ఉదయం 9 గంటలకు హనుమాన్​ చాలీసా చదువుతానని నవనీత్ గురువారం ప్రకటించారు. దీంతో ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్దకు శివసేన సైనికులు ఉదయం భారీగా చేరుకున్నారు. 9 గంటలు దాటినా నవనీత్​ కౌర్​ రాలేదని.. ఆమె ఇంటి వద్దకే వెళ్లారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

హనుమాన్ చాలీసా సవాల్​.. నవనీత్ కౌర్​ ఇంటివద్ద భారీగా శివసైనికులు

Hanuman Chalisa: మరోవైపు ఠాక్రేకు మద్దతుగా ఆయన నివాసం వద్దకు మహిళలు కూడా తరలివచ్చారు. తాము హనుమాన్ చాలీసా ప్రతులను కూడా తీసుకొచ్చామని, నవనీత్ కౌర్​ రాణా వచ్చి దాన్ని పఠించాలని వారు అన్నారు. కాగా, పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. నవనీత్ కౌర్ దంపతులను ఇంటి నుంచి బయటకు రాకూడదని సూచించారు. మరోవైపు, ఎట్టి పరిస్థితుల్లోనూ మాతోశ్రీకి చేరుకుని తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతానని శపథం చేసిన నవనీత్ కౌర్.. తన పంథాన్ని విరమించుకున్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముంబయికి రానున్న నేపథ్యంలో తమ ఆందోళనను వాయిదా వేస్తున్నట్లు రాణా దంపతులు ప్రకటించారు. ప్రధాని భద్రతకు విఘాతం కలిగించకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమపైకి సీఎం ఠాక్రేనే శివసేన కార్యకర్తలను పంపించారని నవనీత్ కౌర్ ఆరోపించారు. ఆయనకు తనలాంటి వాళ్లను జైలుకు పంపడం తప్ప ఇంకేం తెలియదని ధ్వజమెత్తారు.

ఠాక్రే నివాసం మతోశ్రీ వద్ద మహిళలు

'విపక్ష నేత ఫడణవీస్ నాతో మాట్లాడారు. మోదీ పర్యటన గురించి వివరించారు. లతా మంగేష్కర్ అవార్డును స్వీకరించడానికి ఆయన ముంబయి వస్తున్నారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠించే కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. సీఎంగా ఫడణవీస్ మహారాష్ట్రను చాలా అభివృద్ధి చేశారు. కానీ, రెండున్నరేళ్లుగా ఠాక్రే చేసిందేమీ లేదు. బాలాసాహెబ్ భావాలు ఉద్ధవ్ ఠాక్రేలో కొంచెమైనా మిగిలి ఉంటే.. హిందుత్వ భావజాలాన్ని విడిచిపెట్టకూడదు' అని ప్రెస్​కాన్ఫరెన్స్​లో పేర్కొన్నారు నవనీత్.

అయితే, ఎంతకీ ఆందోళనలు తగ్గకపోవడం వల్ల.. పోలీసులు నవనీత్​ను ఆమె నివాసం నుంచి బయటకు తరలించారు. అంతకుముందు, పోలీసులతో నవనీత్ రాణా దంపతులు వాగ్వాదానికి దిగారు. తమపై బెదిరింపులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులుపెట్టాలని డిమాండ్ చేశారు. చివరకు, పోలీసులతో వెళ్లేందుకు అంగీకరించారు. వెళ్లే ముందు పోలీసు వాహనం పైకి ఎక్కి నినాదాలు చేశారు నవనీత్. కాగా, మతపరమైన కారణాలతో రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నవనీత్​ కౌర్​, ఆమె భర్త రవి రాణాను అరెస్టు చేశారు.

తన నివాసం బయట నవనీత్ కౌర్

Maharashtra News: సీఎం ఠాక్రే నివాసం మాతోశ్రీకి రక్షణ కల్పించేందుకే శివసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారని ఆ పార్టీ నేత అనిల్ దేశాయ్ తెలిపారు. నవనీత్ రాణా, ఆమె భర్త రాష్ట్రంలో శాంతి భద్రతలను సవాల్​ చేస్తున్నారని, వారిని వెనకనుంచి ఎవరో నడిపిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారని చెప్పారు. శివసైనికులు భారీగా రావడం వల్ల ఠాక్రే నివాసంతో పాటు నవనీత్​ రాణా ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇదీ చదవండి:చెంప దెబ్బకు రివెంజ్​.. ఇంటి యజమానిపై ఐదు రౌండ్ల కాల్పులు

Last Updated : Apr 23, 2022, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details