తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శివసేన ఎప్పడూ మా శత్రువు కాదు' - భాజపా, శివసేన కూటమి

భాజపాకు శివసేన ఎప్పుడూ శత్రువు కాదన్నారు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​. రెండు పార్టీలు కలిసి మళ్లీ కూటమి ఏర్పాటు చేయడంపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

fadnavis
ఫడణవీస్​

By

Published : Jul 5, 2021, 4:37 AM IST

Updated : Jul 5, 2021, 7:17 AM IST

మహారాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేపైనా తరచూ విమర్శలు గుప్పించే ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌.. శివసేనకు అనుకూల వ్యాఖ్యలు చేశారు. భాజపాకు శివసేన ఎప్పుడూ శత్రువు కాదన్నారు. రెండు పార్టీలూ కలిసి మళ్లీ కూటమిని ఏర్పాటు చేస్తాయా? అన్న ప్రశ్నకు సమాధానంగా పరిస్థితులను బట్టి సరైన నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు.

"భాజపా, శివసేన ఎప్పుడూ శత్రువులు కాదు మిత్రులే. ప్రజాభివృద్ధి కోసమే వ్యతిరేకంగా పోరాడాయి. వారు ఇతరులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మమ్మల్ని విడిచిపెట్టారు"

-దేవేంద్ర ఫడణవీస్, భాజపా నేత

రాజకీయాల్లో 'కానీ', 'అయితే' పదాలకు తావుండదని ఫడణవీస్‌ అన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారిపోతుంటాయని చెప్పారు. ఎన్‌సీపీ నేతలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఫడణవీస్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించింది. రానున్న ఐదేళ్లపాటు శివసేన, కాంగ్రెస్‌ బంధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. కానీ, కూటమిలో మార్పులుపై చర్చోపచర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఇదీ చూడండి:పవార్​- ఫడణవీస్​ భేటీపై శివసేన కీలక వ్యాఖ్యలు

ఇదీ చూడండి:'కాంగ్రెస్​ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి అసాధ్యం'

Last Updated : Jul 5, 2021, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details