బంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శివసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. 'శివసేన పార్టీ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రేతో చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. త్వరలో కోల్‌కతా చేరుకోబోతున్నాం' అని రౌత్ ట్వీట్‌లో స్పష్టం చేశారు.
ఇప్పటికే బంగాల్ ఎన్నికలను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో శివసేన ఈ ప్రకటన చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా బంగాల్ ఎన్నికల్లో శివసేన పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి బంగాల్‌లో ఆ పార్టీ ఉన్నప్పటికీ.. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది.