బంగాల్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని శివసేన ప్రకటించింది. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
దీదీకి అండగా..
బంగాల్ శాసనసభ పోరులో శివసేన నిలుస్తుందా లేదా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సంజయ్ రౌత్ అన్నారు. అయితే దీనిపై పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామని వెల్లడించారు. బంగాల్లో ప్రస్తుతం మమత ఒంటరి పోరాటం చేస్తున్నారని.. ఈ పరిస్థితుల్లో ఆమెకు అండగా నిలవాలనుకుంటున్నట్లు తెలిపారు.