తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Shiv Sena Dispute Supreme Court : 'మా ఆదేశాలే బేఖాతరా?'.. మహారాష్ట్ర స్పీకర్​పై సుప్రీం ఆగ్రహం - సుప్రీంకోర్టులో శివసేన ఎమ్మెల్యే కేసు

Shiv Sena Dispute Supreme Court : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేతోపాటు పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను స్పీకర్ బేఖాతరు చేయలేరని స్పష్టం చేసింది.

Shiv Sena Dispute Supreme Court
Shiv Sena Dispute Supreme Court

By PTI

Published : Oct 13, 2023, 3:24 PM IST

Shiv Sena Dispute Supreme Court : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేతోపాటు పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ జాప్యం చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులను స్పీకర్ బేఖాతరు చేయలేరని స్పష్టం చేసింది.

'ఎవరైనా స్పీకర్‌కు సలహా ఇవ్వండి'
Shiv Sena Disqualification Hearing : 'సుప్రీంకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేయలేరని ఎవరైనా స్పీకర్‌కు సలహా ఇవ్వండి' అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారాన్ని ఎప్పటిలోగా తేలుస్తారో కాల వ్యవధి చెప్పాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ తెలిపారు. లేకపోతే మొత్తం ప్రక్రియే అసంపూర్ణమవుతుందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

'సుప్రీంకోర్టు ఉత్తర్వులే అత్యున్నతమైనవి'
Supreme Court Decision On Shiv Sena Today : స్పీకర్ ఇచ్చే కాల వ్యవధి తమను సంతృప్తి పరచని పక్షంలో రెండు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని తామే ఆదేశిస్తామని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం హెచ్చరించింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగినపుడు సుప్రీంకోర్టు ఉత్తర్వులే అత్యున్నతమైనవని వ్యాఖ్యానించింది. వచ్చే సోమవారం లేదా మంగళవారం ఇందుకు సంబంధించిన పిటిషన్లపై విచారణ జరుపుతామని తెలిపింది.

ఇప్పటివరకు స్పీకర్​ నుంచి నో ఆన్సర్​
Shiv Sena MLAS Disqualification : ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే, ఇతర శివసేన (శిందే వర్గం) ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో కాలవ్యవధిని చెప్పాలంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 18న ఆదేశించింది. "ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్​లకు సంబంధించి వారంలోగా స్పీకర్​ ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను సొలిసిటర్​ జనరల్​ కోర్టుకు సమర్పించాలి" అని అప్పుడు సుప్రీం ఆదేశించింది. కాగా, ఇప్పటివరకు దీనిపై స్పీకర్ నుంచి ఎటువంటి సమాధానం కోర్టుకు రాలేదు.

'నమ్మకం పోయింది.. ఈసీని రద్దు చేయండి'.. ఎన్నికల సంఘంపై ఉద్ధవ్ ఫైర్​

సుప్రీం తీర్పుపై మాటల యుద్ధం.. రాజీనామాకు ఠాక్రే డిమాండ్.. ఫడణవీస్ చురకలు

ABOUT THE AUTHOR

...view details