మహారాష్ట్రలో అత్యంత రద్దీగా ఉండే పుణ్యక్షేత్రాల్లో షిరిడీ సాయిబాబా దేవాలయం ఒకటి. లాక్డౌన్ కారణంగా మార్చి 17న మూసివేసిన ఆలయం దాదాపు 7నెలల తరువాత ఇవాళ తెరుచుకోనుంది. ఈ ఆలయంలో కఠిన నియమ నిబంధనలు అమలులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది.
* పది సంవత్సరాలలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారికి షిరిడీలో దర్శనానికి అనుమతి లేదు.
* దర్శనం కోసం స్థానికులకు టోకెన్లు ఇస్తారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఆన్‌లైన్‌లో పాస్ తీసుకోవాలి. వారికి కేటాయించిన టైమ్ స్లాట్‌లో మాత్రమే దర్శనానికి రావాల్సి ఉంటుంది.
*తమకు కొవిడ్ లేదని తెలిపే ధ్రువీకరణ పత్రాన్ని ప్రతి ఒక్కరు గేటు వద్దనే చూపాలి.
* బాబా సమాధి, ద్వారకా మయి ఆలయాల దర్శనానికి భక్తులకు అనుమతి లేదు.
* భక్తులు చెప్పులను లేకుండా ఆలయంలోకి ప్రవేశించాలి.