Shirdi Sai baba temple timings: ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఈ నిర్ణయంతో షిర్డీ సాయి బాబా దర్శన సమయాలపై ప్రభావం పడింది.
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. షిర్డీ సాయి దర్శనం టైమింగ్స్‌లో కీలక మార్పులు - షిర్డీ టైమింగ్స్
Shirdi Sai baba temple timings: ఒమిక్రాన్ కట్టడికి మహారాష్ట్రలో విధించిన రాత్రి కర్ఫ్యూ కారణంగా షిర్డీ సాయి దర్శన వేళలను మార్పు చేసింది సంస్థాన్ ట్రస్ట్. కర్ఫ్యూ సమయాల్లో ఆలయాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించింది.
షిర్డీ సాయి బాబా దర్శనం
రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం నేపథ్యంలో రాత్రి వేళల్లో దర్శనాలను నిలిపివేసింది శ్రీ సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్. కర్ఫ్యూ వేళల్లో(రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు) ఆలయాన్ని మూసివేయనున్నారు. అలాగే రాత్రి, తెల్లవారు జామున నిర్వహించే 'హారతి' దర్శనాలకు సైతం భక్తులను అనుమతించటం లేదని స్పష్టం చేసింది ట్రస్టు.
ఇదీ చూడండి:Crowd in shirdi: క్రిస్మస్ సెలవులు.. శిర్డీకి పోటెత్తిన భక్తులు