మహారాష్ట్ర షిర్డీలోని సాయి బాబా ఆలయనికి సీఐఎస్ఎఫ్ భద్రత ఏర్పాటు చేయడంపై.. మే 1 నుంచి తలపెట్టిన బంద్ నిర్ణయాన్ని గ్రామస్థులు వెనక్కి తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌తో సమావేశమైన అనంతరం షిర్డీ గ్రామస్తులు ఈ విషయాన్ని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఆలయనికి సీఐఎస్ఎఫ్ భద్రతను వ్యతిరేకిస్తూ.. స్థానికులు మే 1 నుంచి బంద్‌కు పిలుపునిచ్చారు.
ఇదీ వివాదం..
అంతకుముందు.. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్న కారణంగా షిర్డీలోని సాయి మందిరానికి భద్రత రెట్టింపు చేశారు. ప్రస్తుతం సాయిబాబా ఆలయ భద్రతా ఏర్పాట్లను.. సాయి సంస్థాన్ సిబ్బంది నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణ భద్రతను మహారాష్ట్ర పోలీసుల చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. ఆలయాన్ని ప్రతిరోజు బాంబు స్క్వాడ్ తనిఖీ చేస్తోంది. అయితే, ఈ భద్రతా వ్యవస్థకు బదులుగా.. సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలన్న చర్చ ప్రారంభమైంది. దీనిపై సామాజిక కార్యకర్త సంజయ్ కాలే.. 2018లో బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బెంచ్.. సాయి సంస్థాన్ అభిప్రాయాన్ని కోరింది. అయితే, సీఐఎస్ఎఫ్ భద్రతకు సాయి సంస్థాన్ కూడా మద్దతు పలికింది.
అయితే, ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకించి.. కోర్టును ఆశ్రయించారు. అందుకు అవసరమైన నిధులు సమకూర్చడానికి.. రెండు రోజుల క్రితం భిక్షాటన కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి షిర్డీలో అఖిలపక్ష నాయకులు, గ్రామస్థుల సమావేశం జరిగింది. మహారాష్ట్ర దినోత్సవమైన మే 1 నుంచి సమ్మె చేసేందుకు నిర్ణయించారు. ఆ తర్వాత కార్యాచరణ కూడా గ్రామ సభ నిర్వహించి ఆరోజే తెలియజేస్తామని గ్రామస్థుడు నితిన్ కోటే తెలిపారు. దీంతో పాటు నాలుగు ప్రధాన డిమాండ్లు వినిపించారు.