తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మళ్లీ ట్రాక్​ ఎక్కిన 115 ఏళ్ల నాటి స్టీమ్​ రైలు - దేశంలో పురాతన స్టీమ్​ రైలు

ఓ పురాతన రైలు​ హిమాచల్ ​ప్రదేశ్​లోని సిమ్లా రైల్వేట్రాక్​పై పునః దర్శనమిచ్చింది. 115 ఏళ్ల చరిత్ర గల ఈ స్టీమ్​ రైలింజిన్​.. సాంకేతిక కారణాల వల్ల 30ఏళ్ల పాటు పట్టాలెక్కలేదు. మరమ్మతుల అనంతరం 2001 నుంచి తిరిగి సేవలందిస్తోంది. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొన్ని నెలల విరామం తర్వాత మళ్లీ ట్రాక్​పై కనువిందు చేసింది.

115-year-old steam loco hits the tracks again in Shimla
సిమ్లాలో మళ్లీ ట్రాక్​ ఎక్కిన 115ఏళ్ల పురాతన రైలు

By

Published : Nov 4, 2020, 9:56 AM IST

Updated : Nov 4, 2020, 10:17 AM IST

హిమాచల్​ ప్రదేశ్​లో 115 ఏళ్ల పురాతన స్టీమ్​ రైలింజిన్​ విజయవంతంగా ట్రాక్​పై ప్రయాణించింది. సిమ్లా నుంచి కైత్లిఘాట్​ రైల్వేస్టేషన్​ల మధ్య హెరిటేజ్​ కేసీ-520 స్టీమ్​ లోకోమోటివ్​ ఇంజిన్​ ట్రయల్​ రన్​ను దిగ్విజయంగా నిర్వహించారు అధికారులు. యూనెస్కో స్థాయి గుర్తింపుపొందిన సిమ్లా-కాల్కా రైల్వే ట్రాక్​పై ఈ రన్ జరగడం విశేషం.

మళ్లీ ట్రాక్​ ఎక్కిన 115 ఏళ్ల నాటి స్టీమ్​ రైలు

రెండు బోగీ​లతో మంగళవారం ఉదయం 11:05 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ రైలింజిన్​.. అనేకమందిని తమ గమ్యస్థానాలకు చేర్చి సాయంత్రం 4:30 గంటలకు సిమ్లా రైల్వే స్టేషన్​కు తిరిగొచ్చింది. ఇలా ఈ నెల 30 వరకు ఈ రైలు సేవలందించనున్నట్టు సమాచారం. గతంలోనే ఈ​ ట్రయల్స్​ను నిర్వహించాల్సి ఉండగా.. కరోనా వ్యాప్తి కారణంగా సాధ్యపడలేదు.

చరిత్ర

హెరిటేజ్​ కేసీ-520 స్టీమ్​ ఇంజిన్​ను 1905లో ఉత్తర బ్రిటీష్​ లోకోమోటివ్​ కంపెనీ రూపొందించింది. పలు కారణాల వల్ల 1971లో వీటిసేవలు నిలిచిపోయాయి. అయితే.. మరమ్మతుల అనంతరం 2001 నుంచి మళ్లీ పట్టాలెక్కింది హెరిటేజ్​.

ఈ లోకోమోటివ్​ ఇంజిన్​ 41 నుంచి 80 టన్నుల బరువునులాగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గతంలో జాయ్​రైడ్​ల కోసం వినియోగించిన ఈ ఇంజిన్​ను.. ప్రస్తుతం పర్యటకుల కోరిక మేరకు మళ్లీ ట్రాక్​ ఎక్కించింది రైల్వే శాఖ.

ధర ఎంతంటే.?

పండుగ సీజన్​ సందర్భంగా రైడ్​లకు డిమాండ్​ పెరిగే అవకాశం ఉండటం వల్ల.. ప్రభుత్వం కూడా సీటింగ్​ సామర్థ్యాన్ని 30 నుంచి 50 శాతానికి పెంచింది. విదేశీ పర్యటకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ రైలింజిన్ బుకింగ్​ ధర రూ. 1.15లక్షలు(సిమ్లా నుంచి కైత్లిఘాట్​) ఉంటుంది.

ఇదీ చదవండి:'టెలీ-లా'తో 4 లక్షల మందికి న్యాయసేవ

Last Updated : Nov 4, 2020, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details