మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్లో ఉన్న మొఘల్ రాజు ఔరంగజేబ్ సమాధిని హైదరాబాద్‌కు తరలించాలని డిమాండ్ చేశారు శివసేన శాసనసభ్యుడు సంజయ్ శిర్సఠ్. ఇటీవలే ఔరంగాబాద్‌గా ఉన్న పేరును 'ఛత్రపతి శంభాజీ నగర్'గా మార్చింది ప్రభుత్వం. దీనిని వ్యతిరేకిస్తూ శనివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది మజ్లిస్ పార్టీ. AIMIM పార్టీ చేపట్టిన నిరసనలపై సోమవారం మాట్లాడిన సంజయ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఔరంగజేబ్‌పై వారికి అంత ప్రేమ ఉంటే ఆయన సమాధిని హైదరాబాద్‌కు తరలించుకోండి. అక్కడ ఆయన స్మారకాన్ని వారికి ఇష్టం వచ్చినట్లు నిర్మించుకోండి. ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ నిరసనలు చేయొద్దు. వెంటనే నిలిపివేయాలి."
--సంజయ్ శిర్సఠ్, శివసేన శాసనసభ్యుడు
సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన AIMIM
శివసేన శాసనసభ్యుడు సంజయ్ శిర్సఠ్ చేసిన డిమాండ్‌ను AIMIM వ్యతిరేకించింది. వారి రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు AIMIM లోకల్ ప్రెసిడెంట్ షరీఖ్. వారికి ఔరంగజేబ్‌పై అంత కోపం ఉంటే.. జీ20 ప్రతినిధులను ఆయన భార్య రబియా సమాధికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు గత పాలకులపై అంత కోపం ఉంటే.. వారు నిర్మించిన తాజ్‌మహల్ లాంటి ప్రదేశాలపై ఎందుకు ఆదాయాన్ని అర్జిస్తోందంటూ కౌంటర్ వేశారు. భాజపా, దాని మిత్రపక్షాలకు ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలాంటి మార్గాలు లేనందునే.. ఇలా వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.