పేదరికం చాలా మంది కలలను సాకారం చేసుకోకుండా అడ్డుకుంటుంది. కానీ ఈ కుర్రాడు మాత్రం పేదరికంలోనూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. పదో తరగతిలో 91 శాతం మార్కులు సాధించి ఔరా అనిపించాడు. అతనే మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా అట్పాడికి చెందిన హేమంత్ ముదే.
అట్పాడి గ్రామానికి సరిగ్గా రోడ్డు సదుపాయం లేదు. అందువల్ల రోజుకు 10 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు హేమంత్ వెళ్లేవాడు. అతడి తల్లిదండ్రులిద్దరూ గొర్రెల కాపరులు. వీరికి ఇద్దరు సంతానం. వారిలో రెండోవాడు హేమంత్. గొర్రెల పెంపకంపైనే ఆధారపడి వీరి కుటుంబం మొత్తం జీవనం సాగిస్తోంది.