కరోనా నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ అన్నమ్మ అనే దేవతకు కోళ్లు, మేకలను బలి ఇచ్చి పూజలు చేశారు కర్ణాటక బెంగళూరులోని కేపీ ఆగ్రహారం వాసులు.
కేపీ అగ్రహారంలోని చాలా కాలనీల్లోని ప్రజలు ఒకే సమయంలో ఈ పూజలు చేశారు. కాలనీల్లో 'అన్నమ్మ' దేవత పేరుతో ఓ రాయిని ఏర్పాటు చేసి, రంగవల్లికలు వేశారు. అనంతరం దేవతకు కోళ్లు, మేకలను బలి ఇచ్చి పూజలు చేశారు. తమను వైరస్ నుంచి కాపాడాలని వారంతా వేడుకున్నారు.