తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎట్టకేలకు అతనికి పెళ్లికూతురు దొరికింది - గాజియాబాద్

ఎత్తు తక్కువగా ఉన్నందున తనకు పెళ్లికావడంలేదంటూ.. ఉత్తర్​ప్రదేశ్​ సీఎంకు లేఖ రాసిన అజీమ్​ మన్సూరీకీ ఎట్టకేలకు జోడీ కుదిరింది. గాజియాబాద్​కు చెందిన రేహానా అనే యువతి అతన్ని పెళ్లాడేందుకు ముందుకొచ్చింది. దీంతో అజీమ్​ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

she-finally-got-married-to-azim-mansoori-from-uttar-pradesh-who-was-in-the-news-for-not-getting-married-due-to-her-height
ఎట్టకేలకు అతనికి పెళ్లైంది

By

Published : Mar 19, 2021, 7:01 PM IST

ఎత్తు తక్కువగా ఉండడం వల్ల తనకు పెళ్లికావడం లేదంటూ వార్తల్లో నిలిచిన ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన అజీమ్​ మన్సూరీకి ఎట్టకేలకు పెళ్లికూతురు దొరికింది. మన్సూరీ వైరల్​ వీడియో చూసి.. గాజియాబాద్​కు చెందిన రెహానా అతన్ని పెళ్లాడేందుకు ముందుకొచ్చింది.

అజీమ్​ మన్సూరీకీ ఎట్టకేలకు పెళ్లైంది

ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే రెహానా ఎత్తు రెండున్నర అడుగులు. ఆమెకు కూడా చాలాకాలం పెళ్లి సంబంధాలు చూశారు తల్లిదండ్రులు. అయిన పెళ్లికాలేదు. దాంతో మన్సూరీ వీడియోను చూసిన రెహానా కుటుంబం పిల్లనివ్వడానికి ముందుకొచ్చింది. దీంతో అజీమ్​ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇరు కుటుంబాలు కూడా ఎంతో సంతోషిస్తున్నాయి.

అజీమ్​ మన్సూర్​ను పెళ్లాడే రెహానా
అజీమ్​ మన్సూరీ
తల్లిదండ్రులతో రెహానా

ఉత్తర్​ప్రదేశ్​ శామ్లీకి చెందిన 26 ఏళ్ల అజీమ్​ మన్సూరీ.. 3 అడుగుల 2 అంగుళాల పొడవు ఉంటారు. ఎన్నో సంబంధాలు వచ్చినా ఎత్తు తక్కువ ఉన్నందువల్ల పెళ్లి కుదరలేదని ఇటీవల మహిళా పోలీస్​స్టేషన్​కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆ వీడియో వైరల్​గా మారింది. అప్పటి నుంచి తనకు పెళ్లి సంబంధాలు వచ్చాయని చెప్పారు అజీమ్.

ఇదీ చూడండి:'సల్మాన్​ సినిమాలో ఛాన్స్​ వద్దు.. పెళ్లే ముద్దు'

ABOUT THE AUTHOR

...view details