Shashi Tharoor congress president election: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ పోటీ ఖరారైంది. పోటీకి నామినేషన్ పత్రాలు తీసుకున్న శశిథరూర్... రేసులో అధికారికంగా బరిలో దిగిన మొదటి అభ్యర్థిగా నిలిచారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటూ తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచిన తొలి వ్యక్తి కూడా శశిథరూరే కావడం గమనార్హం. అయితే శశిథరూర్.. సెప్టెంబరు 30న నామినేషన్ దాఖలు చేయబోతున్నారని తెలిసింది.
ఇదే విషయంపై ఇటీవల సోనియాను.. శశిథరూర్ కలవగా ఆమె అంగీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న జీ-23 సభ్యుల్లో ఉన్న థరూర్.. అధ్యక్ష ఎన్నిక బరిలో నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. తానూ పోటీకి దిగనున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఇప్పటికే ప్రకటించారు.