తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ హింస: శశిథరూర్​పై దేశద్రోహం కేసు

రైతుల ర్యాలీలో హింసకు కారణమయ్యారంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సహా ఆరుగురు పాత్రికేయులపై నోయిడా పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. పాత్రికేయులు రాజ్​దీప్ సర్దేశాయ్, మృణాల్ పాండే తదితరు పేర్లను ఎఫ్ఐఆర్​లో చేర్చారు.

shashi-tharoor-six-journalists-booked-for-sedition-in-up-over-january-26-violence-in-delhi
దిల్లీ హింసలో శశిథరూర్​పై దేశద్రోహం కేసు

By

Published : Jan 29, 2021, 5:51 AM IST

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సహా ఆరుగురు జర్నలిస్టులపై నోయిడా పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. దిల్లీలో నిర్వహించిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో హింసకు కారణమయ్యారంటూ అభియోగాలు మోపారు. డిజిటల్ ప్రసారాలు, సామాజిక మాధ్యామాల పోస్టుల ద్వారా హింసకు ప్రేరేపించారని స్థానిక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ఎఫ్ఐఆర్​లో చేర్చిన పాత్రికేయుల్లో మృణాల్ పాండే, రాజ్​దీప్ సర్దేశాయ్, వినోద్ జోస్, జాఫర్ అఘా, పరేష్ నాథ్, అనంత్ నాథ్​ల పేర్లు ఉన్నాయి. మరో గుర్తు తెలియని వ్యక్తిని సైతం కేసులో చేర్చారు.

వీరిపై ఐటీ చట్టం ప్రకారం కూడా కేసులను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ అంశంపై నోయిడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details