కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోక్‌పాల్ ఫిర్యాదులు తగ్గాయని, ఇది మంచి సంకేతమంటూ ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్రసింగ్ ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు తెలిపారు. ఈ అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌కు 2019-20లో 1,427 ఫిర్యాదులు రాగా.. ఈ సంఖ్య 2020-21 ఏడాదికి కేవలం 110కి తగ్గగా.. ప్రస్తుత ఏడాదిలో 12 మాత్రమే అందినట్లు వివరించారు. లోక్‌పాల్ వ్యవస్థ సక్రమంగా నడిచేలా తగినంత సిబ్బందిని నియమిస్తామని మంత్రి సభకు తెలిపారు.
చైనాతో సైనిక చర్చలు సానుకూలం, నిర్మాణాత్మకం