గాల్‌బ్లాడర్ (పిత్తాశయం)కు శస్త్రచికిత్స కోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వెల్లడించారు.
గత నెలలో కడుపునొప్పితో శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు. దాంతో మార్చి 30న ఎండోస్కోపీ చేసిన వైద్యులు ఆయన గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ రాళ్లను తొలగించారు. మరో 15రోజుల్లో గాల్‌బ్లాడర్‌ను శస్త్రచికిత్స చేసి తొలగించాలని వైద్యులు అప్పుడే చెప్పారు.