ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో 10రోజుల వ్యవధిలోనే రెండోసారి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ స్థాయిలో సరికొత్త రాజకీయాకీయాలకు ఇది ఆరంభమా అనే చర్చ మొదలైంది. వీరి భేటీలో ఏ విషయం గురించి చర్చ జరిగి ఉంటుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దిల్లీలోని పవార్ నివాసంలో సోమవారం జరిగిన ఈ సమావేశం.. దాదాపు గంటన్నర పాటు సాగింది. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతపైనే ప్రధానంగా చర్చ జరగి ఉండవచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్లూ అనుమానిస్తున్నారు.
మరోవైపు దిల్లీలోని పవార్ నివాసంలోనే రాష్ట్ర మంచ్ సమావేశం మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ప్రధాని మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా రాష్ట్ర మంచ్‌ను 2018లో ఏర్పాటు చేశారు. ఇది రాజకీయ వేదిక కాదు. దేశంలో రాజకీయ, సామాజిక ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు. ఈ సమావేశానికి పవార్ తొలిసారి హాజరవుతున్నారు. ప్రతిపక్షాల నుంచి కీలక నేతలు కూడా ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు.
పవార్ కీలకం