ఆసుపత్రి నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డిశ్చార్జ్ అయ్యారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు సూచించినట్లు మాలిక్ వెల్లడించారు. గాల్ బ్లాడర్ సమస్యతో మార్చి 30న శరద్ పవార్ ఆసుపత్రిలో చేరారు.
"పవార్(80) ఆరోగ్యంగా ఉన్నారు. మరో ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. 15 రోజులపాటు ఆయన ఆరోగ్యంలో ఏ మార్పు లేకపోతే గాల్ బ్లాడర్ సర్జరీ చేయాల్సి ఉంటుంది."