తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీజేపీతో పొత్తుకు అస్సలు ఛాన్సే లేదు.. అజిత్​తో భేటీ అందుకే!: శరద్​ పవార్

Sharad Pawar Comments On Alliance With BJP : బీజేపీతో పొత్తు లేదని ఎన్​సీపీ (శరద్​ వర్గం) అధినేత శరద్​ పవార్ తేల్చిచెప్పారు. తమ రాజకీయ విధానానికి బీజేపీతో అనుబంధం కుదరదని తెలిపారు.

Sharad Pawar Comments On Alliance With BJP
Sharad Pawar Comments On Alliance With BJP

By

Published : Aug 13, 2023, 7:18 PM IST

Updated : Aug 13, 2023, 8:11 PM IST

Sharad Pawar Comments On Alliance With BJP :కొందరు శ్రేయోభిలాషులు తనను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ తాను ఎప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోనని ఎన్​సీపీ (శరద్​ వర్గం) అధినేత శరద్​ పవార్ స్పష్టం చేశారు. ఎన్​సీపీ రాజకీయ విధానానికి.. బీజేపీతో అనుబంధం కుదరదని ఆదివారం తెలిపారు. అజిత్​ పవార్​తో తన భేటీ రహస్యమేమీ కాదని.. అతడు తన అన్న కుమారుడని చెప్పారు.

ఓ కుటుంబ పెద్ద తన కుటుంబంలోని వ్యక్తిని కలవడంలో తప్పేమిటి? అని శరద్​ పవార్​ సూటిగా ప్రశ్నించారు. అలా కలవాలని కోరుకుంటే ఎలాంటి సమస్య ఉండకూడదని ఆయన అన్నారు. శనివారం అజిత్​ పవార్​తో 'రహస్య' సమావేశం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

"మాలో కొందరు (అజిత్​ పవార్​ వర్గం ఎన్​సీపీ) వేరే స్టాండ్​ తీసుకున్నారు. మా శ్రేయాభిలాషులు కొందరు మా వైఖరిలో కూడా మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆ విషయాన్ని వారు మాతో చర్చించడానికి చూస్తున్నారు"
-- శరద్​ పవార్​, ఎన్​సీపీ (శరద్​ వర్గం) అధినేత

ఈసారి మహారాష్ట్ర ప్రజలు మహావికాస్​ అఘాడీ (శివసేన (యూబీటీ), ఎన్​సీపీ (శరద్​ వర్గం), కాంగ్రెస్​)కే పరిపాలన పగ్గాలు అప్పగిస్తారని శరద్​ పవార్​ ఆశాభావం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని షోలాపుర్ జిల్లాలో పర్యటించిన శరద్​.. సంగోలాలో దివంగత ఎమ్మెల్యే గణపత్రావ్ దేశ్​ముఖ్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ కూడా హాజరయ్యారు.

అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి!
ఇటీవల ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ లోక్​మాన్య తిలక్ నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్​సీపీ (శరద్​ వర్గం) చీఫ్ శరద్ పవార్​ను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, అంతకుముందు ఈ కార్యక్రమానికి శరద్​ వస్తారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ సమయంలో ఓ ఏఐసీసీ నాయకుడు ఘాటుగా స్పందించారు. 'పవార్ వ్యవహారంపై మేం చాలా ఆందోళనతో ఉన్నాం. ఆయన మనసులో ఏం మెదులుతుందో అర్థం చేసుకోలేకపోతున్నాం. విపక్ష కూటమి సమావేశం మహారాష్ట్రలో ఉన్నా, లేకపోయినా.. ఇది ఆందోళనకరమైన పరిణామమే. అకస్మాత్తుగా ఆయన పోరాటం ఆపేశారు. ఆయన బీజేపీకి లొంగిపోయారా? ఆయనపై ఒత్తిడి ఏదైనా ఉందా? అన్నది మాకు తెలియదు. ఈ అవార్డు కార్యక్రమం పార్టీలో ఆందోళనలు రేకెత్తించింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం హైకమాండే' ఆ నేత అన్నారు.

'శరద్​ పవార్ తగ్గేదేలే.. ఈ సర్కస్ ఎక్కువ కాలం నిలవదు!'

ఒకే వేదికపై నరేంద్ర మోదీ, శరద్ పవార్​.. లోకమాన్య తిలక్ అవార్డు అందుకున్న ప్రధాని

Last Updated : Aug 13, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details