రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్(sharad pawar) పోటీ చేయనున్నారా? ఆయన ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడనున్నారా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆయనతో భేటీఅయిన అనంతరం రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలు మొదలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యమైన నాయకుడు ప్రస్తుతం పవార్ ఒక్కరే కనిపిస్తున్నారు. అయితే దీనిపై ఎన్‌సీపీ వర్గాలు ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.
Sharad Pawar: రాష్ట్రపతి రేసులో ఎన్‌సీపీ అధినేత!
ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలు వినపడుతున్నాయి. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌తో జరిగిన భేటీలో ఈ విషయం చర్చించినట్టు తెలుస్తోంది.
శరద్ పవార్
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే భాజపా బలం అధికంగా ఉండడం వల్ల ఆ పార్టీ అభ్యర్థే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు పవార్ ఈ పదవికి పోటీ చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం ప్రజల మధ్య ఉండడానికి ఇష్టపడే ఆయన ఈ పదవిని కోరుకుంటారా అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి.