తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Sharad Pawar Ajit Pawar : 'NCPలో చీలిక లేదు.. అజిత్​ మా నాయకుడే'.. సాయంత్రానికి శరద్​ పవార్ యూటర్న్​ - శరద్​ పవార్​ ఎన్​సీపీ అధినేత

Sharad Pawar Ajit Pawar : మహారాష్ట్ర రాజకీయాలు ఒక్క రోజులోనే రసవత్తరంగా మారాయి. ఉదయం అజిత్ పవార్​ తమ నాయకుడని చెప్పిన ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​.. సాయంత్రానికి మాట మార్చారు. ఇంకీ శరద్ పవార్​ ఏమన్నారంటే?

Sharad Pawar Ajit Pawar
Sharad Pawar Ajit Pawar

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 11:34 AM IST

Updated : Aug 25, 2023, 10:18 PM IST

Sharad Pawar Ajit Pawar : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ తమ పార్టీ నాయకుడని చేసిన వ్యాఖ్యలపై యూటర్న్​ తీసుకున్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్​. తాను అలా చెప్పలేదని మాట చెప్పారు. సతారాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు మాట్లాడారు. అంతకుముందు పుణె జిల్లాలోని తన స్వగ్రామమైన బారామతిలోని మీడియా సమావేశంలో శరద్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో చీలిక ఏర్పడలేదని.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తమ పార్టీ నాయకుడిగానే కొనసాగుతున్నారని తెలిపారు. కొంతమంది నేతలు భిన్నమైన రాజకీయ వైఖరిని అనుసరించి ఎన్‌సీపీని విడిచిపెట్టారని.. అయితే దీనిని చీలికగా పరిగణించలేమని చెప్పారు.

మీడియాతో మాట్లాడుతున్న శరద్​ పవార్​

"ఆయన (అజిత్ పవార్) తమ నాయకుడని చెప్పడానికి ఎటువంటి విభేదాలు లేవు. ఎన్‌సీపీలో చీలిక లేదు. అసలు పార్టీలో చీలిక ఎలా జరుగుతుంది? జాతీయ స్థాయిలో పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వెళ్లిపోతేనే చీలిక అవుతుంది. కానీ ఇప్పుడు ఎన్​సీపీలో అలాంటి పరిస్థితి లేదు. కొందరు నాయకులు భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో నిర్ణయం తీసుకోవడం వారి హక్కు."
-శరద్​పవార్​, ఎన్​సీపీ అధినేత

Supriya Sule On Ajit Pawar : అయితే అజిత్​ పవార్​.. తమ పార్టీ సీనియర్​ నాయకుడేనని శరద్ పవార్​​ కుమార్తె సుప్రియ సూలే.. గురువారం వ్యాఖ్యానించారు. "ఆయన(అజిత్ పవార్) పార్టీకి వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. మేం అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నాం" అని సుప్రియ అన్నారు. తాజాగా శరద్​ పవార్​ అలాంటి వ్యాఖ్యలే చేయడం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Sharad Pawar NCP Crisis : అంతకుముందు, ఆగస్టు 20వ తేదీన పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో అజిత్​ వర్గం నేతలపై శరద్​ పవార్​ విమర్శలు చేశారు. కొందరు ఎన్​సీపీ నేతలు.. ఏజెన్సీల భయంతోనే శివసేన (శిందే వర్గం)- బీజేపీ ప్రభుత్వంలో చేరారని ఆరోపించారు. వారిలో కొందరు ఈడీ దాడులు ఎదుర్కొన్నారని తెలిపారు. మరికొందరు ఈడీ విచారణను ఎదుర్కొలేకే ప్రభుత్వంలో చేరారని ఆయన ఆరోపణలు చేశారు. అనంతరం మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ను శరద్​పవార్​ ప్రశంసించారు.

"ఎన్​సీపీ సీనియర్​ నాయకుడు అనిల్ దేశ్‌ముఖ్ వంటి కొందరు నేతలు జైలుకు వెళ్లడానికి అంగీకరించారు. జైలులో 14 నెలల పాటు గడిపారు. తమ (బీజేపీ) పార్టీలో చేరితే దర్యాప్తు ఉండదని ఆయనకు అప్పట్లో ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. పార్టీ భావజాలాన్ని విడిచిపెట్టలేదు" అని శరద్​ పవార్ అన్నారు.

NCP Crisis In Maharashtra : జులై 2వ తేదీన.. ఎన్​సీపీ నేత అజిత్​ పవార్​తో పాటు మరో ఎనిమిది మంది ఆ పార్టీ ఎమ్యెల్యేలు.. శిందే నేతృత్వంలోని శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా అజిత్​ పవార్​.. ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు​.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Last Updated : Aug 25, 2023, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details