Shamshabad Woman Murder Case Update :శంషాబాద్‌లో జరిగిన మంజుల అనే మహిళ హత్య కేసును పోలీసులు 24గంటల్లోనే చేధించారు. ఈ ఘాతుకానికి లక్ష రూపాయల ఆర్థిక లావాదేవీలే కారణమని తేల్చారు. నిందితురాలు రిజ్వానా బేగంను అరెస్టు చేసినట్లు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ కేసులో సాంకేతిక అధారాలు సేకరించి చేధించినట్లు పేర్కొన్నారు.
డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ అర్థరాత్రి గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించామని.. మృతదేహం వద్ద తాళం చెవి, మెడికల్ స్లిప్ దొరికిందని వీటి ఆధారంతో మృతురాలు మంజులగా గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. నిందితురాలు రిజ్వానా బేగంకు మంజుల గతంలో లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చిందని.. ఈ వివాదంతోనే మంజులను ఆమె హత్య చేసిందన్నారు.
Woman Murder Case in Shmshabad :అప్పుకు బాండ్ రాసి ఇస్తానని రిజ్వానా మంజులను ఇంటికి పిలిపించుకుని... ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారంగా మంజుల కళ్లలో కారంతో దాడి చేసి చీరకొంగుతో మెడగట్టిగా ఊపిరి ఆడకుండా చేసి చంపిందని డీసీపీ వివరించారు. ఆతర్వాత మెడలో ఉన్న పుస్తెలతాడు, చైన్, చెవిపోగులు తీసుకుందని వివరించారు.
రన్నింగ్ ట్రైన్లో రేప్.. బిడ్డను బయట పడేస్తామని బెదిరించి తల్లిపై అత్యాచారం
రాత్రి 11గంటలు దాటిన తర్వాత మృతదేహాన్ని యాక్టివా బండిపై బయటకు తీసుకువచ్చి సాయి ఎంక్లెవ్ ఖాళీ స్థలంలో పెట్రోల్ పోసి తగులపెట్టిందన్నారు. హత్య అనంతరం ఆమె అజ్మీర్‌కు వెళ్లిపోవడానికి సిద్ధపడినట్లు తెలిపారు. మరొకరి దగ్గర చేసిన అప్పును తీర్చేందుకు మృతురాలి చైన్‌ను ఫైనాన్సింగ్‌లో రూ.83వేలకు తాకట్టు పెట్టి.. రూ.50వేలు అప్పు తీర్చిందని వివరించారు. ఇలానే రిజ్వానా చాలా చోట్ల అప్పులు చేసినట్లు డీసీపీ తెలిపారు.
"ఈ నెల 10వ తేదీ అర్థరాత్రి గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించాము. మృతదేహం వద్ద తాళం చెవి, మెడికల్ స్లిప్ దొరికిందని వీటి ఆధారంతో మృతురాలు మంజులగా గుర్తించాము. నిందితురాలు రిజ్వానా బేగంకు మంజుల గతంలో లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఇంటికి పిలిచి కంట్లో కారం కొట్టి చీర కొంగుతో మెడకు బిగించి చంపింది. ఆతర్వాత బయటకు తీసుకెళ్లి కాల్చి చంపింది."- నారాయణ రెడ్డి, శంషాబాద్ డీసీపీ