తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చీప్ షాంపూ' చిచ్చు.. వివాహాన్నే రద్దు చేసుకున్న వరుడు.. అసలేమైందంటే?

అన్నీ సవ్యంగా జరిగి ఉంటే ఆరు గంటల్లో వివాహం జరిగిపోయేది.... కానీ ఓ చిన్న విషయం వధూవరుల మధ్య చిచ్చు పెట్టింది.. చివరకు వివాహం రద్దు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది.. అదేంటంటే..?

When Sunsilk Shampoo destroy a marriage
When Sunsilk Shampoo destroy a marriage

By

Published : Dec 17, 2022, 10:16 PM IST

ఓ చిన్న షాంపూ.. పెళ్లినే ఆపేసిందంటే నమ్మగలరా? అవును.. అసోంలో ఇలాంటి ఘటనే జరిగింది. వివాహానికి ముందు వరుడు తరఫు కుటుంబం ఇచ్చే వస్తువుల్లో తక్కువ ధర షాంపూ ఉండటమే వివాదానికి కారణమైంది. ఈ కారణంతో పెళ్లి ఆగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే...
బార్పెటా జిల్లాలోని హౌలీ ప్రాంతంలో నివసించే ఓ యువతికి.. పెళ్లి నిశ్చయమైంది. వివాహానికి ముందు వరుడి కుటుంబం.. సంప్రదాయబద్ధంగా కొన్ని వస్తువులను వధువుకు పంపిస్తుంటుంది. అందులో పలు గిఫ్ట్​లు, ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులను పెట్టి పంపారు వరుడి కుటుంబ సభ్యులు. అప్పటివరకు అంతా బాగానే జరిగింది.

అయితే, వారు పంపిన వస్తువుల్లో చీప్ క్వాలిటీ షాంపూ ఉందన్న కోపంతో వధువు.. వరుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోపంతో వాట్సాప్​లో మెసేజ్ చేస్తూ... 'నీ స్థాయి ఇంతేనా?' అంటూ సందేశం పంపింది. వధువు తీరును చూసి షాక్​కు గురైన వరుడు.. వివాహాన్ని వెంటనే రద్దు చేసుకున్నాడు. ఆరు గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా.. ఈ నిర్ణయం తీసుకొని ఆశ్చర్యపరిచాడు. డిసెంబర్ 14న ఈ ఘటన జరిగింది.

వరుడు గువాహటికి చెందిన వ్యక్తి. వృత్తిరీత్యా ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. వధువు అలా తనను అవమానిస్తూ సందేశం పంపేసరికి.. ఆమెను పెళ్లి చేసుకునేదే లేదని తేల్చి చెప్పాడు. ఇదే విషయాన్ని తన కుటుంబానికి, వధువు కుటుంబానికి స్పష్టంగా చెప్పేశాడు. ఈ విషయం తెలియగానే అమ్మాయి తరఫు కుటుంబం ఆగమేఘాల మీద గువాహటికి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. యువతిని క్షమించి.. యథావిధిగా వివాహం జరిగేలా చూడాలని కోరింది. కానీ, ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో యువతి కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. వాట్సాప్ సందేశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details