shaikh imran attack on woman family in akiveedu : పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు మండలం సిద్ధాపురంలో దారుణం చోటు చేసుకుంది. షేక్ ఇమ్రాన్ అనే యువకుడు ఓ యువతి కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గత ఏడాది నుంచి పెళ్లి చేసుకోవాలని యువతి వెంట షేక్ ఇమ్రాన్ పడుతున్నాడు. ఆ యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో.. విషయం తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నాడు. ఈరోజు ఆమె ఇంటికి వచ్చి.. తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో యువతి తల్లి, తాతపై దాడి చేశాడు. ఈ దాడిలో వారికి తీవ్రగాయాలు కాగా.. ఆమెను తన వెంట తీసుకుని పరారయ్యాడు. గాయపడిన వారిని బంధువులు భీమవరంలోని ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. యువతి తాత.. తలకు బలమైన గాయాలు అవ్వడంతో పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. ఆకివీడు పోలీసులకు యువతి బంధువులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం.. యువతి కుటుంబంపై యువకుడు దాడి - ap news

యువతి కుటుంబంపై యువకుడు దాడి
22:20 July 25
పెళ్లి చేసుకోవాలని ఏడాదిగా వెంట పడుతున్న షేక్ ఇమ్రాన్
Last Updated : Jul 25, 2023, 10:58 PM IST