తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జినోమ్‌ కన్సార్టియం ఛైర్మన్​ జమీల్ రాజీనామా - సీనియర్​ వైరాలజిస్ట్​ షాహిద్​ జమీల్​

ఇన్సాకాగ్​ ఛైర్మన్​ పదవికి సీనియర్​ వైరాలజిస్ట్​ షాహిద్​ జమీల్​ రాజీనామా చేశారు. వైరస్​ జన్యుపరిణామక్రమాన్ని విశ్లేషించడానికి కేంద్రం గతేడాది డిసెంబరులో ఇన్సాకాగ్​ను ఏర్పాటు చేశారు. కరోనాపై పోరులో కేంద్రం తీరుపై జమీల్‌ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

senior virologist Shahid Jameel, సీనియర్​ వైరాలజిస్ట్​ షాహిద్​ జమీల్​
సీనియర్​ వైరాలజిస్ట్​ షాహిద్ జమీల్

By

Published : May 17, 2021, 8:58 AM IST

Updated : May 18, 2021, 8:17 AM IST

దేశంలో ఎక్కడ చూసినా కరోనా కల్లోలమే. ఈ సమయంలో కేంద్రానికి మార్గనిర్దేశం చేయాల్సిన ప్రముఖ వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌... జినోమ్‌ కన్సార్షియం (ఇన్సాకోగ్‌) అధిపతి పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సార్స్‌ కోవ్‌-2 జన్యు మార్పులను ఎప్పటికప్పుడు ఇన్సాకోగ్‌ పర్యవేక్షిస్తోంది. మార్పులకు అనుగుణంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. ఇలాంటి కీలక పదవికి జమీల్‌ రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. శుక్రవారం ఇన్సాకోగ్‌ సమావేశంలో జమీల్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు. 'కారణం చెప్పలేదు. పదవికి రాజీనామా చేస్తున్నానని మాత్రమే అన్నారు' అని ఆ సమావేశానికి హాజరైన శాస్త్రవేత్త చెప్పారు. 'బహుశా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారేమో (కరోనా విషయంలో)' అని ఇంకో శాస్త్రవేత్త పేర్కొన్నారు.

ప్రభుత్వ తీరు నచ్చకే..?

కరోనా ఎదుర్కొవడంతో కేంద్రం తీరుపై జమీల్‌ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మహమ్మారిపై పోరాటంలో శాస్త్రవేత్తల సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని కూడా ఆయన భావిస్తున్నారు. ఇటీవల ‘న్యూయార్క్‌ టైమ్స్‌’లో రాసిన వ్యాసంలో ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ కొరత, తక్కువ స్థాయిలో కరోనా పరీక్షలు చేయడం తదితర అంశాలపై ప్రభుత్వ తీరును ఆ వ్యాసంలో తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా జయించేశామని భారత నాయకత్వం ఇచ్చిన సందేశంతో టీకా కార్యక్రమం సరిగా జరగలేదన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలని, అందుకు టెస్ట్‌ల సంఖ్యను పెంచాలని వ్యాసంలో పేర్కొన్నారు. అదే సమయంలో రోజుకు కోటి మందికి టీకా వేయాలని, ఇందుకోసం వాక్సిన్‌ సరఫరాను రెండింతలు పెంచాలని సలహా ఇచ్చారు. ప్రస్తుత 50 వేల టీకా కేంద్రాలు సరిపోవని, వాటి సంఖ్యను భారీగా పెంచాలని సూచించారు. తన తోటి శాస్త్రవేత్తలు కూడా ఇలానే ఆలోచిస్తున్నారని, వారికి ప్రభుత్వం నుంచి మద్దతు లభించడం లేదన్నారు. డేటా ఇవ్వాలని, దాని వల్ల మరింత అధ్యయనానికి వీలు కలుగుతుందని 800 మంది శాస్త్రవేత్తలు గత నెల ప్రభుత్వాన్ని అభ్యర్థించిన సంగతిని ప్రస్తావించారు. సాక్ష్యాలు, డేటా ఆధారంగా చేసుకొని విధానాల రూపకల్పన జరగడం లేదని విమర్శించారు. జమీల్‌ రాజీనామాపై కాంగ్రెస్‌ స్పందించింది. ‘‘దేశంలోనే పేరొందిన వైరాలజిస్ట్‌ షాహిద్‌ జమీల్‌ రాజీనామా దురదృష్టకరం. ధైర్యంగా, ముక్కుసూటిగా అభిప్రాయాలు తెలిపే నిపుణులకు మోదీ ప్రభుత్వంలో చోటు లేదు’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్ మండిపాటు..

జమీల్ రాజీనామాకు కేంద్రమే కారణమని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. భయం లేకుండా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చే వృత్తి నిపుణులకు మోదీ ప్రభుత్వంలో చేటు లేదని ధ్వజమెత్తింది. సాక్ష్యాల ఆధారిత విధాన రూపకల్పన పట్ల మోదీ సర్కార్​కు ఉన్న విముఖత వల్లే దేశంలో ప్రస్తుతం ఈ సంక్షోభం నెలకొందని కాంగ్రెస్ సీనియర్​ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.

ఇదీ చదవండి :కేంద్రమంత్రి గ్రామంలో 2 వారాల్లో 30 మరణాలు!

Last Updated : May 18, 2021, 8:17 AM IST

ABOUT THE AUTHOR

...view details