త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పుదుచ్చేరిలో కేంద్ర హోం మంత్రి, భాజపా సీనియర్ నేత అమిత్ షా.. ఆదివారం పర్యటించనున్నారు. భాజపా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
శనివారం రాత్రి 10:45 గంటలకు చెన్నై చేరుకున్న అమిత్ షా.. ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని భాజపా ఎంపీ, మీడియా ఇన్ఛార్జ్ అనిల్ బలౌనీ తెలిపారు. పుదుచ్చేరిలోని కరైకల్‌లో భాజపా కోర్ కమిటీ సమావేశానికి షా హాజరవుతారని చెప్పారు.
"పుదుచ్చేరి కోర్ కమిటీ సమావేశం అనంతరం కరైకల్‌లో బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారు. మధ్యాహ్నం అక్కడి మండల స్థాయి పార్టీ కార్యకర్తలతో షా సమావేశమవుతారు. పుదుచ్చేరి నుంచి తమిళనాడులోని విల్లాపురానికి షా చేరుకుని, తీవనై మహిళా కళాశాల వద్ద భాజపా కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు."