తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారికి ప్రజా సంక్షేమం కంటే.. వారసత్వమే ముఖ్యం' - shah generation politics

తమిళనాట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా..​ డీఎంకే, కాంగ్రెస్​ పార్టీపై ముప్పేట దాడికి దిగారు. వారసత్వ రాజకీయాలపై తనదైన రీతిలో విమర్శలు చేశారు. ఇరుపార్టీలకు ప్రజాసంక్షేమం పట్టదన్నారు.

Shah tears into 'dynasty politics' of DMK and Congress
'వారికి కావాల్సింది సంక్షేమం కాదు.. వారసత్వ రాజకీయాలు'

By

Published : Feb 28, 2021, 9:28 PM IST

అన్నాడీఎంకే, ఎన్డీఏలు పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే.. కాంగ్రెస్​, డీఎంకే పార్టీలు మాత్రం అవినీతిపై దృష్టి పెడుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా విమర్శించారు. ఇరుపార్టీలు విభజించు, పాలించు విధానాన్ని అనుసరించి రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ ఆలోచన అంత రాహుల్​ని ఎలా ప్రధానమంత్రిని చేయాలి అనే దానిపై ఉందని ఎద్దేవా చేశారు. ఉదయనిధిని తమిళనాడుకు ముఖ్యమంత్రిని చేయడం గురించి స్టాలిన్ ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. తమిళనాడు విల్లుపురంలో విజయ్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఉదయనిధిని సీఎం చేయాలనేది స్టాలిన్ లక్ష్యం. రాహుల్‌ను ప్రధాని చేయాలనేది సోనియా కోరిక. కాంగ్రెస్‌, డీఎంకేలు 2జీ కుంభకోణంలో భాగస్వాములు. 2జీ, 3జీ, 4జీ లాంటి అన్ని జనరేషన్​లు తమిళనాడులోనే ఉన్నాయి. 2జీ అంటే 2 తరాల మారన్ కుటుంబం. 3జీ అంటే 3 తరాల కరుణానిధి కుటుంబం. 4జీ అంటే 4 తరాల గాంధీ కుటుంబం. వీరికి ప్రజా సంక్షేమం కంటే అవినీతే ముఖ్యం."

ABOUT THE AUTHOR

...view details