తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రతినెలా బంగాల్​కు వెళ్లనున్న అమిత్​షా, నడ్డా - అమిత్​షా నడ్డాలు బంగాల్​లో

కేంద్ర హోంమంత్రి అమిత్​షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఇకపై ప్రతి నెలా బంగాల్​లో పర్యటిస్తారని బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ తెలిపారు. బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకు వారి పర్యటనలు ఉంటాయని పేర్కొన్నారు.

ప్రతినెలా బంగాల్​లో భాజపా సీనియర్​ నేతల పాగా
Shah, Nadda to visit Bengal every month till end of assembly polls: BJP state chief

By

Published : Nov 18, 2020, 6:52 PM IST

వచ్చే ఏడాది ఏప్రిల్​-మేలో బంగాల్​లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీదీ ప్రభుత్వాన్ని కూల్చటమే లక్ష్యంగా భాజపా ముందడుగు వేస్తోంది. బంగాల్​లో ఎన్నికలు పూర్తయ్యేవరకు ప్రతి నెలా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంలో పర్యటించ నున్నట్లు బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ తెలిపారు.

అమిత్​షా రెండు రోజులు, నడ్డా మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఘోష్​ వివరించారు.

"బంగాల్​ ప్రజలు కాంగ్రెస్​, సీపీఎం, తృణమూల్​ పార్టీలకు అవకాశం ఇచ్చారు. కానీ వారు ప్రజల అంచనాలను అందుకోవటంలో విఫలమయ్యారు. భాజపా ప్రజల ఆశలను తీరుస్తుంది."

---దిలీప్​ ఘోష్​ , బంగాల్​ భాజపా అధ్యక్షుడు.

ఎన్నికల నేపథ్యంలో బంగాల్​ను పార్టీ ఐదు విభాగాలుగా విభజించింది. ఒక్కో నాయకుడిని ఒక్కో ప్రాంతానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించింది.

ఐదుగురు వీరే..

సునీల్​ దియోదార్​-ఉత్తర బంగాల్​

వినోద్​ తావదా -రాహ్​ బంగా

దుష్యంత్​ గౌతమ్- నబద్వీప్​ ప్రాంతం

హరీష్​ ద్వివేదీ- మిడ్నాపుర్

వినోద్ సోన్​కర్ - కోల్​కతా

భాజపా సీనియర్ నాయకులు రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details