Amit Shah On Terrorism: జమ్ముకశ్మీర్‌లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలనే ప్రధాని నరేంద్ర మోదీ కలని నిజం చేయాలని.. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలని అధికారులను ఆదేశించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. సరిహద్దు చొరబాట్లకు అడ్డుకట్ట వేయాలని భద్రతా బలగాలకు సూచించారు. జూన్ 30న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా బలగాలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పలువురు ఉన్నతాధికారులు హజర్యయారు.
'సరిహద్దుల్లో చురుగ్గా ఉండండి.. ఉగ్రవాదుల్ని ఏరిపారేయండి'
Amit Shah On Terrorism: భద్రతా బలగాలు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. ప్రధాని మోదీ శాంతియుత కశ్మీర్ విజన్‌ను నిజం చేయాలని కోరారు. జూన్ 30న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
Amit Shah On Terrorism
సరిహద్దులో ఉగ్రవాద చొరబాట్లు అరికట్టేందుకు నియంత్రణ రేఖ వద్ద భారత సైనికులు అప్రమత్తంగా ఉన్నారని లెఫ్టినెంట్ జనరల్ మంజిందర్ సింగ్ తెలిపారు. సరిహద్దున ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని చొరబాట్లకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. అజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఫిట్ ఇండియా క్యాంపైన్లో ఆయన పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వైన్స్ షాప్‌పై ఉగ్రవాదుల 'గ్రనేడ్' దాడి.. ఒకరు మృతి