తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​లో అమిత్​ షా ఏరియల్​ సర్వే - అమిత్​ షా ఏరియల్​ సర్వే

ఉత్తరాఖండ్​లో వరదల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షాా ఏరియల్​ సర్వే నిర్వహించారు. మొత్తం 3500 మందికిపైగా వరద బాధితులను రక్షించామని.. 16వేలకుపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అమిత్​ షా వెల్లడించారు.

Amit shah Arial survey
ఉత్తరాఖండ్​లో అమిత్​ షా ఏరియల్​ సర్వే

By

Published : Oct 21, 2021, 2:55 PM IST

ప్రభుత్వం అప్రమత్తమై తగిన చర్యలు చేపడుతుండటం ద్వారా ఉత్తరాఖండ్​లో వరదల కారణంగా వాటిల్లే నష్టాన్ని కట్టడి చేయగలిగామని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. రాష్ట్రంలో భారీ వర్షాలకు ఇప్పటివరకు 64 మంది ప్రాణాలు కోల్పోగా, 11 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్​ సర్వే నిర్వహించిన సందర్భంగా షా ఈ వ్యాఖ్యలు చేశారు.

మొబైల్​ నెట్​వర్క్​ను 80 శాతం వరకు పునరుద్ధరించామని.. నైనితాల్​, అల్మోరా, హల్దానీలలో రోడ్డు మార్గాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు అమిత్​ షా. తప్పిపోయిన రెండు ట్రెక్కింగ్​ బృందాల్లో ఒక బృందం ఆచూకీ ఇప్పటికే కనుగొన్నామని తెలిపారు. 3500 మందికిపైగా వరద బాధితులను రక్షించామని.. 16వేలకుపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. పర్యటకులు కూడా సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు.

ఏరియల్​ సర్వే నిర్వహిస్తున్న అమిత్​ షా

రాష్ట్రంలో ప్రస్తుతం 17 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు, 7 ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు, 15 పీఏసీ బృందాలు సహా 5000 మంది పోలీసులను అత్యవసర సేవలకు అందుబాటులో ఉంచినట్లు షా స్పష్టం చేశారు.

ఏరియల్​ సర్వేలో అమిత్​ షాతో పాటు ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి, గవర్నర్​ గురుమిత్​ సింగ్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజామ్​ భట్​, విపత్తు నిర్వహణ శాఖ సహాయ మంత్రి ధన్​ సింగ్​ రావత్​లు కూడా పాల్గొన్నారు.

ట్రెక్కింగ్​కు వెళ్లి నలుగురు మృతి

ఉత్తరాఖండ్​లోని సుందర్​ధుంగ వద్ద పర్వతారోహణకు వెళ్లిన ఆరుగురిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. మరోవైపు కఫ్నీ గ్లేసియర్​ వద్ద ట్రెక్కింగ్​కు వెళ్లిన 20 మంది కూడా కనిపించకుండాపోయారు. తప్పిపోయిన వారిని ఆచూకీ కనుగొనేందుకు అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ద్వాలీలో భారీ వర్షాల కారణంగా 34 మంది పర్యటకులు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారిని రక్షించేందుకు అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేప్పటినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి :China vs india: డ్రాగన్​ది​ అదే తీరు.. సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?

ABOUT THE AUTHOR

...view details