హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్, సీషెల్స్ దేశాల మధ్య కీలకమైన భాగస్వామ్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 'సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్'(సాగర్) అనే భారతదేశ విధానంలో సీషెల్స్ది ముఖ్యమైన స్థానమని చెప్పారు. సీషెల్స్ అధికారులతో జరిగిన అత్యున్నత సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు మోదీ.
కరోనా పోరులో సీషెల్స్‌కు అండగా ఉంటామని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా సమయంలో అత్యవసర ఔషధాలతో పాటు 50 వేల టీకా డోసులను అందించినట్లు చెప్పారు. కొవిడ్ అనంతరం ఆర్థిక పునరుద్ధరణకూ సీషెల్స్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీషెల్స్ ప్రధాని వావెల్ రామ్కలావన్ను భారత ముద్దుబిడ్డగా అభివర్ణించారు. ఆయన మూలాలు బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఉన్నట్లు చెప్పారు.