తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండేళ్ల బాలికనూ వదలని కామాంధుడు.. హత్యకు యత్నించి...

రెండేళ్ల బాలికను లైంగిక వేధింపులకు (Sexual Harassment) గురి చేశాడు మానవ మృగం. అనంతరం హత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో జరిగింది.

Sexual Harassment
అత్యాచార వేధింపులు

By

Published : Nov 1, 2021, 4:01 PM IST

కర్ణాటక మంగుళూరులో రెండేళ్ల బాలికను లైంగిక వేధింపులకు (Sexual Harassment) గురి చేశాడు బిహార్​కు చెందిన ఓ వ్యక్తి. అంతేగాకుండా ఆ చిన్నారిని చంపేందుకు ప్రయత్నించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు చందన్​ను అరెస్ట్​ చేశారు.

నిందితుడు చందన్​

ఇదీ జరిగింది..

కర్ణాటక మంగుళూరులోని హోయిగే బజార్​లో ఉండే ఫిష్​ కటింగ్​ యార్డ్​లో బిహార్​కు చెందిన సుమారు 75 మంది పని చేస్తూ ఉంటారు. వీరిలో ఒకడైన చందన్​.. అక్కడే ఉండే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు బాలిక కోసం గాలించారు. సుమారు 9 గంటల వెతుకులాట అనంతరం స్థానికంగా ఉండే ఉప్పునీటి మడిలో చిన్నారిని గుర్తించారు.

అప్పటికే బాలిక మృతి చెందిందని భావించిన కుటుంబసభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బాలిక వేధింపులకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నిందితుడు చందన్​ను అదుపులోకి తీసుకున్నారు. లైంగిక వేధింపులకు గురి చేసిన అనంతరం... నిందితుడు బాలికను పక్కన ఉన్న ఉప్పు నీటి మడిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:'ధరలు పెరిగితే ఏంటి?.. ప్రజలు బాగానే సంపాదిస్తున్నారు కదా!'

ABOUT THE AUTHOR

...view details