ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. నిందితుడు శరవణన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఓ ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన రోజు మద్యం మత్తులో ఉన్నాడని పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అడయార్‌కు చెందిన బాధితురాలు బైక్‌పై వెళ్తోంది. రామ్‌నగర్‌కు చెందిన శరవణన్ అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమెను బైక్‌తో వెంబడించాడు. అనంతరం ఆమె బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బాధితురాలు కింద పడిపోయింది. ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించాడు.
నిందితుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్న విషయం గమనించిన బాధితురాలు అతడిని వెనక్కి నెట్టేసింది. అయితే ఈ క్రమంలో నిందితుడు.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం అసభ్యపదజాలంతో బాధితురాలిని దూషించాడు. ఆమెపై దాడి అనంతరం ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. నిందితుడు శరవణన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు.. బాధితురాలిని ద్విచక్రవాహనంపై వెంబడించి దాడికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.