తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హాస్టల్​కు వచ్చి HM లైంగిక వేధింపులు.. కర్రలు, చీపుర్లతో చితకబాదిన అమ్మాయిలు - కర్ణాటక హెడ్​మాస్టర్​ లేటెస్ట్​ న్యూస్​

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే స్టూడెంట్స్​ను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థినులు హెడ్​మాస్టర్​ను కర్రలు, చీపుర్లతో కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.

girl students thrash headmaster in karnataka
girl students thrash headmaster in karnataka

By

Published : Dec 15, 2022, 10:27 PM IST

Updated : Dec 15, 2022, 10:49 PM IST

ప్రధానోపాధ్యాయుడిని కర్రలు, చీపుర్లతో చితకబాదిన అమ్మాయిలు

కర్ణాటకలో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడిని హాస్టల్‌ విద్యార్థినులు చితకబాదారు. అనంతరం విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్‌మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం మండ్య జిల్లాలో జరిగిందీ ఘటన.

ఇదీ జరిగింది..
బుధవారం సాయంత్రం ప్రధానోపాధ్యాయుడు హాస్టల్‌ సందర్శనకు వచ్చాడు. అయితే ఆ సమయంలో ఒక విద్యార్థినిని తన రూమ్‌కు పిలిచి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె సహాయం కోసం కేకలు వేసింది. అప్రమత్తమైన మిగతా విద్యార్థినులు వెంటనే అక్కడకు చేరుకుని హెడ్‌మాస్టర్‌పై కర్రలు, చీపుర్లతో దాడిచేశారు.

చాలా కాలంగా ప్రధానోపాధ్యాయుడు తమను వేధిస్తున్నాడని అశ్లీల వీడియోలు చూడాలంటూ అనుచితంగా అక్కడక్కడ తాకేవాడని తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెబితే సర్టిఫికెట్‌లో ప్రవర్తన సరిగాలేదని.. రాస్తానని బెదిరించేవాడని విద్యార్థినులు వాపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అక్కడకు చేరుకొని.. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

బాలికపై అత్యాచారం చేసి.. ఆపై..
ఛత్తీస్​గఢ్​లో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై ఓ మైనర్ అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేశాడు. డిసెంబర్ 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం..
రాయ్​పుర్​ ప్రాంతంలో డిసెంబర్​ 7న.. ఎనిమిదేళ్ల చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో చిన్నారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీలో రికార్డ్​ అయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అందులో చిన్నారి ఇంటికి సమీపంలో ఉండే ఓ 14 ఏళ్ల అబ్బాయి బాలికను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ మైనర్​ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

విచారణలో తానే బాలికను అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లు చెప్పాడు. అనంతరం గొంతునులిమి హత్య చేసినట్లు వెల్లడించాడు. దీంతో నిందితుడిపై పోక్సోచట్టం కేసు నమోదుచేసి పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే నిందితుడ్ని పోలీసులు తీసుకువెళ్తుండగా.. గ్రామస్థులు అడ్డగించి ఆ మైనర్​పై దాడి చేశారు.

Last Updated : Dec 15, 2022, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details