తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మేనల్లుడిపై అత్త అత్యాచారం- ఏడాదిగా అలానే!- ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు - పదహారేళ్ల బాలుడిపై అత్యాచారం చేసిన అత్త

Aunt Raped Niece In Mumbai : మేనల్లుడిపై ఏడాదిగా అత్యాచారానికి పాల్పడుతోంది ఓ మహిళ. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలుడిని బెదిరించింది. మహారాష్ట్రలోని ముంబయిలో జరిగిందీ ఘటన.

Sexual Assault On Niece In Mumbai
Sexual Assault On Niece In Mumbai

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 5:25 PM IST

Updated : Dec 2, 2023, 6:39 PM IST

Aunt Raped Niece In Mumbai :మహారాష్ట్రలోని ముంబయిలో పదహారేళ్ల బాలుడిపై అతడి అత్త అత్యాచారానికి పాల్పడింది. ఏడాదిగా పలుమార్లు అత్యాచారం చేసింది. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం- ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ 16 ఏళ్ల బాలుడు తనకు ముంబయి నగరాన్ని చూడాలని ఉందని తన తల్లిదండ్రులతో చెప్పాడు. దీంతో వారు నగరంలోని తాడ్​దేవ్​ ప్రాంతంలో ఉంటున్న అతడి మేనమామ వద్దకు ఆ బాలుడిని పంపించారు. అయితే అతడి మేనమామ డ్యూటీలో భాగంగా ఆఫీస్​కు వెళ్లేవారు. ఇదే అదనుగా తీసుకున్న బాలుడి అత్త(40) అతడిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడేది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలుడిని బెదిరించేది.

బాలుడిపై అతడి అత్త పలుమార్లు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా శారీరకంగా కూడా హింసించేదని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అత్త పెడుతున్న ఇబ్బందులను ఎవరికీ చెప్పలేదు బాలుడు. అయితే అత్త ఆకృత్యాలు భరించలేని బాలుడు ఇటీవలే జరిగినదంతా తల్లికి చెప్పాడు. మొత్తం విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు షాకయ్యారు. ముంబయి వచ్చి బాలుడి అత్తపై తాడ్​దేవ్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు మైనర్ కావడం వల్ల పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

కన్నకుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డ కసాయి తండ్రి
గుజరాత్​లో కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి. రాజ్​కోట్​కు చెందిన బాధితురాలి తల్లి తన చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుంచి తండ్రే పెంచుతున్నాడు. అయితే మొదటి భార్య చనిపోవడం వల్ల అతడు రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవలే తన రెండో భార్య పుట్టింటికి వెళ్లింది. ఇదే అదనుగా తీసుకున్న నిందితుడు తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఎవరికైనా ఈ విషయాన్ని చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించాడు. తండ్రి బెదిరింపులకు భయపడిన బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. దీంతో బాధితురాలిపై ప్రతిరోజు దారుణంగా అత్యాచారం చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి అమ్మమ్మ అతడిని తీవ్రంగా మందలించింది. దీంతో అతడు పారిపోయాడు. బాధితురాలి బామ్మ ఫిర్యాదు అందుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

భార్యను చంపి వాట్సాప్ స్టేటస్​గా పెట్టిన కసాయి భర్త
తమిళనాడులో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపి ఆ దృశ్యాలను వాట్సాప్​ స్టేటస్​లో పోస్ట్​ చేశాడు ఓ భర్త. కేరళకు చెందిన ఓ యువతి చెన్నైలో నివాసం ఉంటోంది. ఆమెకు కొంతకాలం క్రితం ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహానికి దారితీసింది. ఈ క్రమంలోనే వారు ఓ అనాథ బాలుడిని దత్తత తీసుకున్నారు.

అయితే ఇటీవలే మరో మహిళతో తన భర్త దిగిన ఫొటోను అతడి ఫోన్​లో చూసింది బాధితురాలు. ఈ విషయంపై అతడిని నిలదీసింది. దీంతో వారిమధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలోనే ఆమెపై దాడి చేసి టీ-షర్ట్​తో గొంతునులిమి చంపాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి వాట్సాప్​ స్టేటస్​లో పోస్ట్​ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సరిగ్గా చూసుకోవడం లేదని తల్లిని కాల్చి చంపిన మైనర్​.. రెండు నెలల పాపను చంపిన అమ్మ

రూ.300 కోసం దారుణం.. తమ్ముడిని చంపిన అన్న.. మంచినీళ్ల​ ట్యాంక్​లో శరీర భాగాలు..

Last Updated : Dec 2, 2023, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details