తెలంగాణ

telangana

ETV Bharat / bharat

12 ఏళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడి అత్యాచారం! - దిల్లీ క్రైమ్​

Sexual assault: ఇంటి ముందు ఆడుకుంటున్న 12 ఏళ్ల బాలికను మాయమాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి 12 ఏళ్ల బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇందుకు మరో బాలుడు సహాయపడ్డాడు. ఈ దుర్ఘటన ఈశాన్య దిల్లీలో గత సోమవారం జరిగింది.

Rape
అత్యాచారం

By

Published : Jan 26, 2022, 3:04 PM IST

Sexual assault: ఓ 12 ఏళ్ల బాలికపై పొరుగింటిలో ఉండే 12 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఈశాన్య దిల్లీలోని శాస్త్రి పార్క్​ ప్రాంతంలో గత సోమవారం జరిగింది.

ఇదీ జరిగింది..

శాస్త్రి పార్క్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 12 ఏళ్ల బాలిక నివసిస్తోంది. సోమవారం.. తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. పొరుగింటిలో ఉండే 12 ఏళ్ల బాలుడు మాయమాటలు చెప్పి.. బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇందుకు మరో బాలుడు సహాయం చేశాడు. బాలుడి చెర నుంచి బయటపడిన బాలిక.. ఇంటికి వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లితో చెప్పింది.

ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలి తల్లి. బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు... అపహరణ, అత్యాచారం సహా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్​ చేశారు. అలాగే ఈ దుశ్చర్యకు సహాయపడిన మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:ఆర్​ఆర్​బీ పరీక్షలో 'అక్రమాల'పై ఆగ్రహం- రైలు తగలబెట్టిన అభ్యర్థులు!

ABOUT THE AUTHOR

...view details