తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భార్యతో బలవంతపు శృంగారం అత్యాచారం కాదు' - భార్యతో బలవంతపు శృంగారంపై చత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పు

చత్తీస్‌గఢ్‌ హైకోర్టు (Chhattisgarh high court) సంచన తీర్పు ఇచ్చింది. భార్యతో బలవంతంగా శృంగారం చేసినా (Marital rape) దానిని అత్యాచారంగా పరిగణించలేమని ఓ కేసు విచారణలో భాగంగా పేర్కొంది. 376వ అధికరణలోని రెండో మినహాయింపు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.

Marital rape not crime
భార్యతో బలవంతపు శృంగారమైన రేప్​ కాదు

By

Published : Aug 27, 2021, 11:26 AM IST

భార్యతో బలవంతపు శృంగారం చేసినా (Marital rape) దాన్ని అత్యాచారంగా పరిగణించబోమని చత్తీస్‌గఢ్‌ హైకోర్టు తెలిపింది. ఈ మేరకు భారత శిక్షాస్మృతి 376వ అధికరణ కింద దాఖలైన అభియోగాల నుంచి 37 ఏళ్ల వ్యక్తిని విముక్తున్ని చేసింది. అయితే అతనిపై 377 అధికరణ కింద నమోదైన అసహజ నేరాలతో పాటు (Unnatural offences) ఇతర అభియోగాలు కొనసాగుతాయని పేర్కొంది.

చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య వయసు 18 ఏళ్లు లోపు లేకపోతే.. బలవంతంగా శృంగారం చేసినా అది నేరం కిందకు రాదని 376వ అధికరణలోని రెండో మినహాయింపు స్పష్టంగా చెబుతోందని న్యాయమూర్తి తెలిపారు. అందుకే ఆ అభియోగాల నుంచి విముక్తి కల్పించినట్లుపేర్కొన్నారు.

ఇదీ చదవండి:Condom: కండోమ్‌ మరిచిపోయి అసహజ రీతిలో.. చివరకు?

ABOUT THE AUTHOR

...view details