నగ్నంగా వీడియో కాల్స్ చేస్తారు. అవతలి వారితోనూ నగ్నంగా(Honey trap) మాట్లాడిస్తారు. ఆ వీడియోలు రికార్డు చేసి అడిగినంత ఇవ్వకపోతే ఇంటర్నెట్‌లో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇలా 300 మందిని మోసగించి.. రూ.20 కోట్లకు పైగా వసూలు చేసిందో ముఠా. పరువుకు భయపడి బాధితులు ఫిర్యాదు చేయకపోయినా.. తీగలాగితే ఈ డొంక కదిలిందన్నట్టుగా చిన్న కేసులో భాగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మోసాన్ని గుట్టురట్టు చేశారు. భార్యాభర్తలు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు.
యూపీలోని ఘాజియాబాద్‌కు చెందిన భార్యాభర్తలైన సప్నా గౌతమ్, యోగేశ్ ఈ కేసులో ప్రధాన నిందితులు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ఈ తరహా మోసాలకు తెరతీశారు. ఈ జంటకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సలహా మేరకు ఈ తరహా మోసాలు ప్రారంభించారు. ఈ దందాలో ఒక్కొక్కరిదీ ఒక్కో పాత్ర. బాధితులతో వీడియో కాల్స్ మాట్లాడడం, మరికొందరి యువతులకు శిక్షణ ఇచ్చి వారిచేత కూడా ఇవే పనులు చేయించడం సప్నా పని. బాధితుల వివరాలు, వారి ప్రదేశం, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతాలను యోగేశ్ సేకరిస్తుంటాడు.
తొలుత ఓ అడల్ట్ వెబ్‌సైట్‌లో ఈ ముఠా సభ్యులు పేరు నమోదు చేసుకుంటారు. కొత్త కొత్త ఐడీలతో నగ్నంగా వీడియోకాల్స్(Honey trap) చేస్తారు. ఇందుకు నిమిషానికి రూ.234 చెల్లించాలి. ఇందులో సగభాగం వెబ్‌సైట్ నిర్వాహకులకు, మిగిలిన సగం వీరికి చేరుతుంటుంది. అయితే, ఇంతకంటే తక్కువ మొత్తానికి తాము వీడియోలో అందుబాటులో ఉంటామంటూ బాధితుల నుంచి వీరు ఫోన్ నంబర్లు సేకరిస్తారు. నేరుగా వారికే వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా వీడియో కాల్స్ చేస్తారు. అవతలివారిని కూడా నగ్నంగా మాట్లాడమని సూచిస్తారు. అనంతరం అవతలి వ్యక్తి వీడియోలను రికార్డు చేస్తారు. వారి ఫోన్ నంబర్‌కు వీడియోలు పంపించి, అడిగిన మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తారు. కాదంటే వీడియోలు బహిర్గతం చేస్తామని బెదిరిస్తారు. ఇలా ఎంతోమందిని వీరు మోసం చేశారు. ఇలా దాదాపు 300 మంది దగ్గర నుంచి రూ.20 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు తమ విచారణలో గుర్తించారు.
అమ్మాయిలకు జీతాలిచ్చి..