తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పెళ్లి చేసుకుంటానని.. శృంగారం చేస్తే తప్పులేదు!' - మదురై బెంచి

పెళ్లి చేసుకుంటానని హామీనిచ్చి శృంగారంలో పాల్గొంటే తప్పులేదని మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై బెంచ్​ వ్యాఖ్యానించింది. ఈ మేరకు లైంగిక దాడి కేసులో ఓ వ్యక్తిపై పడిన జైలు శిక్షను తగ్గించింది.

Sex on the promise of marriage is not fault: HC
Sex on the promise of marriage is not fault: HC

By

Published : Oct 16, 2021, 8:03 PM IST

తమిళనాడు రామనాథపురంకు చెందిన మలైస్వామి అనే వ్యక్తికి ఓ మహిళతో సంబంధం ఉండేది. కొద్ది కాలం అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మంచి తనను లైంగికంగా దగ్గరికి తీసుకున్నాడని, చివరికి వదిలేశాడని ఆ మహిళ ఆరోపించింది. తనపై లైంగిక దాడి జరిగిందని రామనాథపురం మహిళా కోర్టులో కేసు వేసింది.

కేసుపై విచారణ చేపట్టిన మహిళా కోర్టు.. మలైస్వామికి 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. రూ. 25వేల జరిమానా కట్టాలని ఆదేశించింది.

ఈ తీర్పునకు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు మలైస్వామి. విచారణ చేపట్టిన మదురై బెంచి.. ఆ సమయంలో మలైస్వామితో మహిళకు సంబంధం ఉందని, అందువల్ల ఆమె ఫిర్యాదును అంగీకరించలేమని తీర్పునిచ్చింది. మహిళా కోర్టు విధించిన జైలు శిక్షను ఏడాదికి తగ్గిస్తూ తీర్పునిచ్చింది.

విచారణలో భాగంగా.. వారిద్దరికి పుట్టిన బిడ్డ పరిస్థితిపై జస్టిస్​ ఆర్​ పొంగిప్పన్​ ఆందోళన వ్యక్తం చేశారు. బిడ్డ కోసం రూ. 5లక్షలు జాతీయ బ్యాంకులో డిపాజిట్​ చేయాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:-'నేతలతో కుమ్మక్కైన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు'

ABOUT THE AUTHOR

...view details