భాజపా మాజీ మంత్రి సీడీ కేసు వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్, డీసీపీ ఎంఎన్ అనుచెత్, ఎస్ఐ మారుతిపై దర్యాప్తు చేపట్టాలని కర్ణాటక కోర్టు ఆదేశించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 లోగా నివేదిక సమర్పించాలని చెప్పింది. 8వ ఏసీఎంఎం కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది(karnataka minister cd case).
బాధితురాలు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆలస్యం చేసినందుకు పోలీసు అధికారులపై ఐపీసీ సెక్షన్ 166కింద అభియోగాలు మోపి, దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది(karnataka cd case).
కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహోళికి సంబంధించిన ఓ వీడియో సీడీ ఈ ఏడాది మొదట్లో తీవ్ర దుమారం రేపింది. అందులో ఓ మహిళతో ఆయన అభ్యంతరకరంగా ఉన్న దశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్గా మారాయి. బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో జనాధికారి సంఘర్ష పరిషత్ ఉపాధ్యక్షుడు ఆదర్శ్ ఆర్ అయ్యర్ పోలీసు అధికారులపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఆర్టీఐ ఉద్యమకారుడు దినేశ్ కళ్లహళ్లి కూడా ఈ ఏడాది మార్చిలో ఫిర్యాదు చేశారు(ramesh jarkiholi cd).