దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో.. వైరస్ సామాజిక వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు కేంద్రం పరిశోధన చేపట్టనున్నట్లు సమాచారం. మురుగునీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇన్సాకాగ్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరగనుంది.
ఈ పరీక్షల ద్వారా ప్రస్తుతం దేశంలో ఏవైనా కొత్త వేరియంట్ల వ్యాప్తి ఉంటే గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మూడో దశ సహా భవిష్యత్తులో కరోనా తీవ్ర రూపం దాల్చకుండా కట్టడి చేసేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.