తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బురేవి' ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు - తమిళనాడుపై బురేవి ఎఫెక్ట్​

బురేవి తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీరప్రాంతంలోని లోతట్టు గ్రామాలు నీటమునిగాయి. కాలనీల్లోకి నీరు చేరి జనజీవనం స్తంభించింది.

Burevi cyclone
'బురేవి' ప్రభావంతో తమిళనాడు, పుదుచ్ఛేరిలో భారీ వర్షాలు

By

Published : Dec 5, 2020, 10:25 AM IST

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బురేవి తుపాను.. తీరం దాటిన క్రమంలో తమిళనాడు, పుదుచ్చేరిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

తమిళనాడులోని రామేశ్వరం తీర ప్రాంతంలోని వివిధ గ్రామాలు నీటమునిగాయి. నటరాజపురమ్​ ప్రాంతంలో ఇళ్లల్లోకి నీరు చేరి జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తమిళనాడు రామేశ్వరంలోని నటరాజపురంలోని ఆలయంలో..
తమిళనాడు రామేశ్వరంలో..

పుదుచ్చేరిలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లు, రోడ్లపై భారీ ఎత్తున వరద నీరు చేరి.. జనజీవనం స్తంభించింది. రేయిన్​బో నగర్​లో కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పుదుచ్చేరి రేయిన్​బో నగర్​లో నీటమునిగిన కాలనీలు
పుదుచ్చేరి రేయిన్​బో నగర్​లో వరద నీరు

ఇదీ చూడండి: బురేవి ధాటికి నీటమునిగిన నటరాజస్వామి ఆలయం

ABOUT THE AUTHOR

...view details