తమిళనాడులో ఘోరం జరిగింది. తిరుపత్తూరు జిల్లాలో తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు దుర్మరణం చెందగా.. మరో పదిమంది గాయపడ్డారు. ఉచిత చీరలు, ధోతీల పంపిణీ కోసం జనం ఎగబడడం వల్ల తొక్కిసలాట జరిగింది. థైపుసం వేడుకల సందర్భంగా.. సామాజిక కార్యకర్త అయ్యప్పన్ ప్రతి సంవత్సరం ఉచితంగా ధోతీలు, చీరలు పంపిణీ చేస్తారు. ఇందులో భాగంగానే ఈసారి కూడా వాణియంబాడి మార్కెట్ గ్రౌండ్‌లో టోకెన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 500 మంది ఒక్కసారిగా ఎగబడడం వల్ల తొక్కిసలాట జరిగినట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను వాణియంబాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట.. నలుగురు మృతి.. బంగాల్లో బాంబు పేలి ఒకరు.. - తమిళనాడు తొక్కిసలాటలో నలుగురు మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఉచిత చీరలు, ధోతీల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి.. నలుగురు మహిళలు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. మరోపైపు, బంగాల్లో జరిగిన బాంబు పేలుడులో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
free dhoti and saree distribution
బాంబు పేలుడు..
బంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బాంబు పేలుడు కలకలం రేపింది. బసంతిలోని టిట్కుమార్ గ్రామంలో జరిగిన ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాంబు పేలుడు శబ్దాలు పెద్దగా వినిపించాయని స్థానికులు తెలిపారు.
Last Updated : Feb 4, 2023, 5:39 PM IST