Road accident in Alluri Sitharama Raju District: అల్లూరి జిల్లా ఏవోబీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ లారీ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఏవోబీ కటాఫ్ ఏరియాలోని హంతల్‌గూడ ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో 10 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. చిత్రకొండ నుంచి జడంబోకు సిమెంట్ లోడు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను టిప్పర్ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అల్లూరి జిల్లా ఏవోబీలో సిమెంట్ లారీ బోల్తా - ఐదుగురు మృతి - సిమెంట్ లారీ బోల్తా

Road accident
Published : Nov 25, 2023, 2:59 PM IST
|Updated : Nov 25, 2023, 3:21 PM IST
14:57 November 25
ప్రమాదంలో మరో 10 మందికి తీవ్రగాయాలు
Last Updated : Nov 25, 2023, 3:21 PM IST