Mysore Accident Today : కర్ణాటకలో ఓ కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మైసూరు జిల్లాలోని టి.నరసిపుర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఇన్నోవా కారులో మైసూరు ట్రిప్‌నకు బయల్దేరింది. మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
Road Accident In Mysore : ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో అందులో చిక్కుకున్నవారిని బయటకు తీయడం కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా
మైసూరు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
'రూ.10లక్షలు ఇవ్వాలి!'
అంతకుముందు.. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక చెరకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కురుబూరు శాంతకుమార్ స్పందించారు. "జాతీయ రహదారికి ఇరువైపుల పెరిగిపోతున్న చెట్లను జాతీయ రహదారి అథారిటీ కత్తిరించడం లేదు. అందుకే ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై నేషనల్ హైవే అథారిటీనే బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
బస్సును ఢీకొన్న ట్రక్కు.. 10మందికిగా..
మహారాష్ట్రలో జరిగిన మరో ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఠానే జిల్లాలోని ముంబయి- నాసిక్ జాతీయ రహదారిపై ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.
బస్సును ఢీకొన్న ట్రక్కు.. 10మందికిగా..
ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Guwahati Road Accident :అసోం గువాహటిలోని జలుకబారి ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం..
అసోంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల నుంచి 10 మంది విద్యార్థులతో కలిసి వెళ్తున్న ఓ స్కార్పియో కారు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే అదుపుతప్పి రోడ్డుపై ఆగి ఉన్న ఓ బొలేరో వాహనాన్ని బలంగా తాకింది. దీంతో కార్లో ఉన్న 10 మంది విద్యార్థుల్లో ఏడుగురు అక్కడిక్కక్కడే మరిణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.