తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Three Persons Died with Electric Shock: విజయనగరం జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి - విజయనగరంలో విషాదం

Three Persons Died
Three Persons Died

By

Published : Aug 3, 2023, 10:09 AM IST

Updated : Aug 3, 2023, 4:14 PM IST

10:06 August 03

ఇంటి నిర్మాణంలో విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు మృతి

విజయనగరం జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

Three Persons Died with Electric Shock: విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సోమన్నపేటలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణంలో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందారు. గ్రామానికి చెందిన పాండ్రంకి రామినాయుడు నిర్మిస్తున్న ఇంటి పనుల నిమిత్తం ఆయన చిన్న కుమారుడు కేసరి ఇంటి పైకి వెళ్లి పక్కన ఉన్న ఇనుప ఊసను వెనక్కి నెట్టాడు. దీంతో ఇంటి పక్కనే వేలాడుతున్న విద్యుత్ వైర్లకు ఇనుప ఊసలు తగలడంతో కేసరి విద్యుత్ షాక్​కు గురయ్యాడు.

కాపాడే ప్రయత్నంలో..: పక్కనే ఉన్న చంద్రశేఖర్ చూసి.. కేకలు వేసి కేసరిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో చంద్రశేఖర్​ను కూడా విద్యుత్ వైర్లు తాకాయి. కేకలు విన్న వీధిలో ఉన్న అంగన్వాడీ ఆయా రెయ్యమ్మ పరిగెత్తుకుంటూ వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేసి ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఇది చూసిన గ్రామస్థులు విద్యుత్ సరఫరా నిలుపుదల చేసినా.. ముగ్గురూ అప్పటికే అక్కడికక్కడే మృతి చెందారు.

దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. పాండ్రంకి కేసరి (21), గండ్రేటి చంద్రశేఖర్ (18), రెయ్యమ్మ (48) ముగ్గురూ విద్యుదాఘాతంతో మృతి చెందడంతో.. సోమన్నపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

People Die with Electric Shock: యమపాశాలుగా విద్యుత్ తీగలు.. పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం

వరుస విద్యుత్ ప్రమాదాలు.. అజాగ్రత్తగా ఉంటే అంతే..:విద్యుత్ తీగల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. అవి ప్రజల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. గత కొద్దిరోజులలోనే వరుస విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలువురు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

అనంతపురం జిల్లాలో భవన నిర్మాణ కార్మికుడు: అనంతపురం జిల్లా రాయదుర్గంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఓ యువకుడు మృతి చెందాడు. ఇంటికి చోదోడువాదోడుగా ఉండే.. వ్యక్తి చనిపోవడంతో.. ఆ కుటుంబం శోకసంద్రంలో ముగిగిపోయింది. పని చేస్తున్న సమయంలో ఇనుప చువ్వలను విద్యుత్ తీగుల తగిలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి

మరోచోట ఫ్లెక్సీలు కడుతూ..: అభిమాన నటుడు ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు యువకులు మృతి చెందారు. ఫ్లెక్సీలు కడుతుండగా.. విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అభిమాన నటుడు పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కట్టడానికి అని.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు యువకులు.. మృత్యువాతపడ్డారు. వీరు ఇద్దరూ వేర్వేరు కాలేజీల్లో డిగ్రీ చదువుతున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి

Last Updated : Aug 3, 2023, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details