మహారాష్ట్ర అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభాత్ చౌక్‌లో ఉన్న పురాతన భవనం కూలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో జరిగిందని అధికారులు చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న రెండు మృతదేహాలను వెలికితీశామని తెలిపారు.
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ సైతం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. భవనం కూలిపోయే స్థితికి చేరుకుందని.. వెంటనే ఖాళీ చేయాలని కోరినా పట్టించుకోలేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. గత ఏడేళ్లుగా నోటీసులు అనేక సార్లు నోటీసులు జారీ చేసినా.. కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోయారు.