తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Road Accident: ఏపీలో వేరు వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు.. 11మంది మృతి - Two youths died in Anantapur district

Road _Accident
Road _Accident

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 6:19 AM IST

Updated : Sep 3, 2023, 3:40 PM IST

06:13 September 03

బాపట్ల జిల్లాలో ఆటోని ఢీకొన్న లారీ ఐదుగురు మృతి

Road Accident: ఆంధ్రప్రదేశ్​లో వేరు వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి

Road accident in Bapatla district:బాపట్ల జిల్లా సంతమాగులూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. తెల్లవారుజామున నరసరావుపేట నుంచి వినుకొండ రోడ్డు వైపు వెళ్తున్న లారీ.. మార్కాపురం నుంచి వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించగా.. ఘటనా స్థలికి చేరుకున్న వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స అందిస్తుండగా ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరికి వైద్యం కొనసాగుతోంది. మృతి చెందిన వారిలో బెలిమెళ్ల కవిత, అలివేలు మంగతాయారు, పాల్తి నరి, తమ్మిశెట్టి తులసి, బుర్రి మాధవి ఉన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా గుంటూరుకు చెందిన కేటరింగ్ సిబ్బందిగా పోలీసులు గుర్తించారు.

Car Accident in Dhone: మద్యం మత్తులో బైక్​లను ఢీకొట్టి.. బీభత్సం సృష్టించిన కారు.. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలు

Two youths died in Anantapur district:రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పొలికి సమీపంలో చోటుచేసుకుంది. రాత్రి పొద్దుపొయిన తరువాత గుంతకల్లుకు చెందిన బాలుతో పాటు మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై హాంచనహాళ్ నుంచి పొలికి వైపు వస్తున్నారు. పొలికి గ్రామానికి చెందిన వర్దన్​తో పాటు మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై హంచనహాళ్ వైపు వెళ్తున్నారు. ఆ రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాలు (18) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వర్దన్ (20) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విడపనకల్లు ఎస్సై తిప్పయ్య నాయక్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించారు. మృతదేహాలను శవ పరీక్ష కోసం తరలించారు. ఇదే ప్రమాదంలో గుంతకల్లుకు చెందిన షికారు రాహుల్, షికారు బాలికి, పొలికి గ్రామానికి చెందిన మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారి వివరాలు తెలియాల్సి ఉంది. గుంతకల్లుకు చెందిన వారు రాత్రి వేళ పొలికి వద్ద పొలాల్లో కాపలా ఉండటానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Road accident in sathyasai district:సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రదొడ్డి వద్ద జాతీయ రహదారి 42పై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ముదిగుబ్బ వైపు నుంచి కదిరికి వస్తున్న ఆటోను.. కదిరి వైపు నుంచి నల్లమాడ మండలం ఎర్రవంకపల్లికి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బుక్కపట్నం మండలం మదిరే బైలు తండాకు చెందిన ఆటో డ్రైవర్ భాస్కర్ నాయక్, చిన్నస్వామి నాయక్, చలపతి నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న శ్రీలేఖ నిశాంత్, కారులో ఉన్న రజనీష్ రెడ్డి, రామ్మోహన్​కు గాయాలయ్యాయి. శ్రీలేఖ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన రజనీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు సర్ది చెప్పి.. ఆందోళను విరమింప చేశారు.

Lorry Collided With Bike in Palamaneru: విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. ప్రాణాలతో బయటపడిన ఐదేళ్ల చిన్నారి..

Annamaya District:అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి వద్ద కడప చెన్నై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని శరీరం చెల్లా చెదురై అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే గత రాత్రి బోయినపల్లిలోని ఇసుకపల్లి క్రాస్ రోడ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని మృతి చెందాడు, శరీరం చల్లాచెదురు కావడంతో రోడ్డుపై ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న మన్నూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివాహం రాకపోకలు పునరుద్ధరించారు. జరిగిన సంఘటనపై మన్నూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఢీకొన్న వాహనం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Two Students Died in Road Accident : రెండు వాహనాల ఢీ.. ఇద్దరు విద్యార్థులు దుర్మరణం..

Last Updated : Sep 3, 2023, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details